
నిండు పౌర్ణమిలొ విరబూసిన వెన్నెల అమావస్య నాటికి కరిగిపొతుంది, ఉషొదయములొ విరబూసిన పుష్పం సంధ్యా సమయానికి వాడిపొతుంది కాని నాలొ చిగురించిన ఈ ప్రేమ నా శ్వాస ఉన్నంతవరకు ఉంటుంది.
సూర్యుని కిరణానికి, చందమామా వెన్నెలకు చీకటి లేదు, కొయిలమ్మ గొంతుకు మౌనం లేదు, నీ చిరునవ్వుకి మరణం లేదు, నా ఈ ప్రేమ కు అంతము లేదు.
కలతపడి కన్నీరు కురిపిస్తున్న నా కన్నులకు కలలా వచ్చింది నీ ప్రేమ, అందమైన ఊహలతొ నా మదిని దోచింది నీ ప్రేమ, విరబూసిన అందముతొ తత్తరపాటు చూపులతొ నా హ్రుదయాన్ని కదిలించింది నీ ప్రేమ.
ఫ్రియా రాతి లాంటి నా హ్రుదయాన్ని వెన్నముద్దలా కరిగించింది నీ ప్రేమ, నా మదిలోని ఊహలకు జీవము పొసిన నీ ప్రేమ ఎప్పటికి నాకే సొంతము కావాలని కోరుకుంటు నీ సమాదానం కొసము ఎదురుచూస్తూ మిర్చి............................
ఏమిటి మిర్చి ప్రేమ పైత్యము అనుకుంటున్నారా ఏమి లేదు మొన్న మా గుంటూరు బస్ స్టాండ్ లొ కనపడింది కదా ఒక అందమైన అమ్మాయి అప్పుడు మొదలయ్యింది ఈ ప్రేమ పైత్యము.

హరీష్ గారు!! మీ ప్రేమ పైత్యానికి విరుగుడు....
ReplyDeleteకవితారసంతో పాటు బస్టాండ్ లో రోజూ కాపు కాయాలేమో?
ఇంకెందుకు ఆలస్యం కానీయండి...
రామ రామ పద్మార్పితా గారు అ పైత్యానికి విరుగుడు అదె రోజు ప్రయణము లో దొరికింది అదేమిటొ తరువాత టపా లో చెబుతాను.
ReplyDeleteintakante andamaina ammaayi kanipiste aameku kUdaa ilaane cheptaaraa?
ReplyDeleteఅవునా ఆ విరుగుడు ఏంటో త్వరగా తెలియ చేయండి మరి.. పైత్యం వరకూ బాగానే ఉంది. :-)
ReplyDeleteఎంత అందమైన పైత్యం?? అవునూ ప్రేమ పైత్యమంటారా. డిసైడ్ ఐపోయారా??
ReplyDeleteమిర్చి వర్మ గారు....బాగుంది..చక్కగా రాశారు..పైత్యానికి విరుగుడు ఏమి దొరికిందో చెప్పండి మరి త్వరలో..
ReplyDeleteబాగుంది..పైత్యానికి విరుగుడు చెప్పండి మరి
ReplyDeletewaiting for sequel... :)
ReplyDeleteవర్మగారూ.. బాగా రాశారు.. చిన్న విషయం.. వసంతం పూర్తయితే మళ్ళీ వసంతం వచ్చే వరకు కోయిల మౌనవ్రతం చేస్తుంది..
ReplyDeleteఇంత అందమైన భావనని పైత్యం అని తీసిపారేశారేంటండీ!!! నేను దీన్ని ఖండిస్తున్నాను :))
ReplyDeleteబాగా రాసారు.
please remove word verification.
బాగుంది...ప్రేమ పైత్యమైనా, ప్రేమ పిచ్చిదైనా ప్రేమ ప్రేమనే ప్రేమిస్తుందిలెండి!
ReplyDeleteబస్ స్టాండ్ కవిత చదివాను..కానీ నాకొక చిన్న సందేహం ..అంత బాగున్న అమ్మాయి ఏ బాపుగారి చిత్రంలోనొ కదా కనపడాలి..ఇలా బస్ స్టాండ్లో ఉంటుందా..?
ReplyDeleteBus stand lo choostene ila raastunnaru... airport lo chooste... rekkalu lekundane egurutarannamaata... good poetry... :)
ReplyDeleteనాలొ చిగురించిన ఈ ప్రేమ నా శ్వాస ఉన్నంతవరకు ఉంటుంది.
ReplyDeleteనా ఈ ప్రేమ కు అంతము లేదు.
మరునిముషమే విరుగుడు కనిపెట్టిన ప్రేమను గురించి ఇలా రాయడం.....
మీ కవిత చాలా బాగుంది.
ప్రేమకు పునాది నమ్మకమైతే విరుగుడు అపనమ్మకమే కదా... అయినా మీరు కనిపెట్టిన విరుగుడు కూడా కాస్త తొందరగా చెబుదురూ.. :)
చాలా బాగుందండి మీ కవిత.. కానీ ప్రేమని పైత్యమంటారా..హన్నా!! శేఖర్ గారిలా నాకూ నచ్చలేదా పదం..!!
ReplyDeleteమిర్చి వర్మ ఒక మంచి పిల్లాడనుకున్నా ...హమ్మా ...బస్ స్టాండ్లో అమ్మాయిని చూసి కవితలల్లేస్తారా ..... :)
ReplyDeleteఏమాటకామాటే ..కవిత మాత్రం అద్భుతంగా ఉందండీ ...
"నీ చిరునవ్వుకి మరణం లేదు, నా ఈ ప్రేమ కు అంతము లేదు. "చాలా బావుంది !