Thursday, July 16, 2009

అందమైన నా ప్రేమ..............


నిండు పౌర్ణమిలొ విరబూసిన వెన్నెల అమావస్య నాటికి కరిగిపొతుంది, ఉషొదయములొ విరబూసిన పుష్పం సంధ్యా సమయానికి వాడిపొతుంది కాని నాలొ చిగురించిన ఈ ప్రేమ నా శ్వాస ఉన్నంతవరకు ఉంటుంది.

సూర్యుని కిరణానికి, చందమామా వెన్నెలకు చీకటి లేదు, కొయిలమ్మ గొంతుకు మౌనం లేదు, నీ చిరునవ్వుకి మరణం లేదు, నా ఈ ప్రేమ కు అంతము లేదు.

కలతపడి కన్నీరు కురిపిస్తున్న నా కన్నులకు కలలా వచ్చింది నీ ప్రేమ, అందమైన ఊహలతొ నా మదిని దోచింది నీ ప్రేమ, విరబూసిన అందముతొ తత్తరపాటు చూపులతొ నా హ్రుదయాన్ని కదిలించింది నీ ప్రేమ.

ఫ్రియా రాతి లాంటి నా హ్రుదయాన్ని వెన్నముద్దలా కరిగించింది నీ ప్రేమ, నా మదిలోని ఊహలకు జీవము పొసిన నీ ప్రేమ ఎప్పటికి నాకే సొంతము కావాలని కోరుకుంటు నీ సమాదానం కొసము ఎదురుచూస్తూ మిర్చి............................

ఏమిటి మిర్చి ప్రేమ పైత్యము అనుకుంటున్నారా ఏమి లేదు మొన్న మా గుంటూరు బస్ స్టాండ్ లొ కనపడింది కదా ఒక అందమైన అమ్మాయి అప్పుడు మొదలయ్యింది ఈ ప్రేమ పైత్యము.

Friday, July 10, 2009

అందమైన అమ్మాయీ.............


నేనూ మొన్న గుంటూరు నుండి హైద్రాబాదు రావడానికి మా గుంటూరు బస్ స్టాండ్ లొ బస్ కోసము ఎదురు చూస్తున్న సమయములొ ఒక్కసారి నా కనుల ముంగిట ఒక మెరుపు మెరిసింది, ఆ మెరుపు ఏమిటొ తెలుసా ఒక అందమైన అమ్మాయి.. ఆ అమ్మాయి ఎలా వుందీ అంటే......
గంగా నదిలోని గంభీరము......

బ్రహ్మపుత్రా నదిలోని భాహ్యసౌంధర్యమూ......

యమునా నదిలోని యశస్సు......

గోదావరి నదిలోని గడుసుదనమూ......

క్రిష్ణా నదిలోని కొంటితనము......

కావేరి నదిలోని కలుపుగోలుతనము......

తుంగభద్రా నదిలోని తుంటరితనము......

పెన్నా నదిలాంటి పరువము......

నర్మదా నదిలాంటి నెరజాణతనమూ......

తపతి నదిలాంటి తనువు......

నాగవళీ నదిలాంటి నడక......

వంశధారా నదిలాంటి వయ్యారము......

మహా నదిలాంటి ముగ్ధ మనొహరరూపము కలిగి ఉన్న ఆ అమ్మాయీ......

మంచు పూలా గుమ్మలా, పాలరాతి బొమ్మలా, పసిడిపూలా రెమ్మలా వుంది......

అప్పుడు అనుకున్న ప్రకృతిలొ ఎన్నో అందాలు ఉన్నాయీ అ అందాలన్నీ కలగలుపుకోని వుంది ఆ అమ్మాయీ......

Tuesday, July 7, 2009

జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రేరణతో,


లక్ష్యాలుంటాయి..... కాని ఎలా సాధించాలొ తెలియదు.....

అవసరము మంచి అలొచనలని రేకెత్తిస్తుంది......

విభిన్నముగా ఆలోచించడము మెదలుపెడితే, నీ గమ్యన్ని నీవే నిర్దేశించుకుంటావు......

మనలొ కసి, పట్టుదల, సాధించాలనే తపన, కృత నిశ్చయము ఉంటే మనదే విజయము...

ప్రతిభా పాటవాలు,సాధించాలనే కోరిక, పనిమీద వ్యామొహం, నిజాయితీ....

వీటిలొ ఎ ఒక్క లక్షణం లేక పొయినా విజయము సాధించడము కష్టము...

విజయము తాలూకా ఆనందము ఎప్పుడు కలూగుతుంది అంటే, పోరాడి గెలుచుకున్నప్పుడే మాత్రమే...

కల కనగలిగితే దాన్ని సాకారము చేసుకొగలము, కాని ఆ కలను నిజము చేసుకొవాలంటే అందుకు తగ్గట్టు కష్టపడాలి...

నమ్మకము, అనుభంధము లేకపోతే జీవితము లో ముందుకు వెల్లలేము, పూర్తీ గ నమ్మనపుడు విజయము మన దగ్గరికీ రాదు....

పనీ చేస్తున్నంతసేపు ఆ పనీ మీద అభిమానము, శ్రద్ధ, కసి వుంటే విజయము మీదే....

Saturday, July 4, 2009

నా నేస్తమూ.........


తరలి వెల్లే మేఘ మాలికలను అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

కుండపొతగా జారిపడుతున్న వర్షపు బిందువులని అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

ఎగిరి ఎగిరి తుల్లి పడుతున్న సముద్రపు అలలను అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

ఉప్పొంగి పొంగే సెలయేటి నీటి ని అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

గుంపులు గుంపులు గా పరుగులు తీస్తున్న పక్షులని అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

తన కమ్మని గానముతొ అలరిస్తున్న కొయిలమ్మని అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

తొలిపొద్దు సుర్య కిరణాలను అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

పున్నమి వెన్నెల కాంతులు వెదజల్లే చందమామను అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

ముంగిట్లొ ముగ్గులు వెసే ముద్దు గుమ్మని అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

అప్పుడు అవన్నీ నాకు చెప్పినవి నీ నేస్తము ఎక్కడొ కాదు ఇ బ్లాగుల లొకం లొ ఊన్నారు వెళ్లు అని

అందుకనే మీ అందరి కొసము ఈ మన లొకం లొకి వఛ్ఛాను నేస్తములారా నన్ను కూడా మీ స్నెహితుడిగా చేసుకొండి

నేను మీ మిర్చీ వర్మ ను, మాది గుంటూరు........

Friday, July 3, 2009


నా తొలి చిరునవ్వుకు ప్రేరణ మా అమ్మా,

నా తొలి బుడి బుడి నడకలకు ప్రేరణ మా అమ్మా,

నా తొలి చిట్టి పొట్టి పలుకులకు ప్రేరణ మా అమ్మా,

నా తొలి అక్షరబ్యాసానికి గురువు మా అమ్మా,

నా తొలి దైవము,గురువు ,స్నేహితురలు మా అమ్మా,

కాని నా తొలి రాతలకు ప్రేరణ మాత్రాము నా నేస్తము పద్మార్పిత గారు.............

అoదరికి నమస్కరము అండీ నేను మిర్చీ వర్మ ను,మీ అందరి బ్లాగ్స్ చూసాకా నాకూ రాయాలనిపిన్చిరాయడము మెదలుపెట్టాను నాకూ మీ అముల్యమైన సూచనలతొఆశీర్వదించనడి...