Friday, July 10, 2009

అందమైన అమ్మాయీ.............


నేనూ మొన్న గుంటూరు నుండి హైద్రాబాదు రావడానికి మా గుంటూరు బస్ స్టాండ్ లొ బస్ కోసము ఎదురు చూస్తున్న సమయములొ ఒక్కసారి నా కనుల ముంగిట ఒక మెరుపు మెరిసింది, ఆ మెరుపు ఏమిటొ తెలుసా ఒక అందమైన అమ్మాయి.. ఆ అమ్మాయి ఎలా వుందీ అంటే......
గంగా నదిలోని గంభీరము......

బ్రహ్మపుత్రా నదిలోని భాహ్యసౌంధర్యమూ......

యమునా నదిలోని యశస్సు......

గోదావరి నదిలోని గడుసుదనమూ......

క్రిష్ణా నదిలోని కొంటితనము......

కావేరి నదిలోని కలుపుగోలుతనము......

తుంగభద్రా నదిలోని తుంటరితనము......

పెన్నా నదిలాంటి పరువము......

నర్మదా నదిలాంటి నెరజాణతనమూ......

తపతి నదిలాంటి తనువు......

నాగవళీ నదిలాంటి నడక......

వంశధారా నదిలాంటి వయ్యారము......

మహా నదిలాంటి ముగ్ధ మనొహరరూపము కలిగి ఉన్న ఆ అమ్మాయీ......

మంచు పూలా గుమ్మలా, పాలరాతి బొమ్మలా, పసిడిపూలా రెమ్మలా వుంది......

అప్పుడు అనుకున్న ప్రకృతిలొ ఎన్నో అందాలు ఉన్నాయీ అ అందాలన్నీ కలగలుపుకోని వుంది ఆ అమ్మాయీ......

23 comments:

  1. కొత్తగా ఉంది. కాని పెన్న నెరజాణ ఐతే బాగుంటుంది.

    ReplyDelete
  2. అమ్మాయి మీకు నచ్చింది...
    మీ నదీ ప్రవాహాల జోరు ముచ్చటగా ఉంది.

    ReplyDelete
  3. మిర్చివర్మ ఒకమంచి పిల్లాడా , నదుల అనుసంధానం బాగనే చేశారు ఒక కొంటె పిల్ల పేరు చెప్పి. కానీ నాకొక సందేహం,కవితలో దాచినా దాగని పద వర్ణనలు, కవితా నడక చూస్తుంటే ఒక అబ్బాయి వర్ణించినట్టు కాకుండా పద్మార్పిత గారు బెత్తం పట్టుకొని మీ చేత రాపించినటు వుంది :)

    బాగుంది, గురువేమో "క"లువల మీద పడ్డారు, మీరేమో నదులవెంటబడ్డారు. ప్రయత్నిస్తే ఇంకా బాగా సుందరంగా వ్రాయగలరు.

    ReplyDelete
  4. హ హ మంచిప్రయత్నం బాగా రాసారు :)

    ReplyDelete
  5. మొత్తానికి ఎవరికోసం ఆగకుండా.. తన పని తను చేసుకుపోయే అమ్మాయి అంటారు.. జాగర్తండి బాబు ఇలాంటి వారితో పాటు కొట్టుకుపోగలరు.
    ..అహ.. మాది గుంటూరే ... మీది గుంటూరే (ఇంద్ర సినిమాలో.. ధర్మవరపు లాగా ట్యూను కట్టుకోండి.) హరీష్ గారు దీర్ఘాలు కొమ్ములు ఒత్తులు చాలా స్వేచ్చగా వాడేస్తున్నారు. గంభీరం కాదు గాంభీర్యము. భాహ్య కాదు బాహ్య. 'నది లాంటి, నదిలోని..' అని ఇలా చాలా సార్లు చెప్పేకంటే.. నది పేరు చెప్పి 'లా ' అంటే సరిపోతుందేమో
    !?

    ReplyDelete
  6. atrEyagaaru
    జాగర్తండి బాబు ఇలాంటి వారితో పాటు కొట్టుకుపోగలరు.

    అనుభవమా? ;-))

    మొత్తానికి ఉపమానాల వరదలో ముంచెత్తారు.
    చాలా బాగుంది.
    బొల్లోజు బాబా

    ReplyDelete
  7. మొత్తానికి అమ్మాయిని చూడగానే మీ భావుకత నదిలా పారిందన్నమాట. బావుంది.
    మొన్నటిసారి మీ బ్లాగు చూసినప్పుడు నేను ఆఫీస్లో బిజీగా ఉన్నానండీ...అందువల్ల వ్యాఖ్య చెయ్యలేకపోయాను.
    please remove word verification.

    ReplyDelete
  8. ఆహా మిర్చీ వర్మా...
    బాగు బాగు నీ బ్లాగు..
    స్వాగతం మరి మన లోకంలోకి..

    అవును బాసూ..
    మా గుంటూరు బస్టాండేంటి?
    మిర్చినెలాగూ పేరులో కలిపేసుకున్నావు..
    గుంటూరు బస్టాండునైనా మిగుల్చు మాబోటోళ్లకి..

    మీది గుంటూరు.. మాది తెనాలీ..

    ReplyDelete
  9. mana guntur busstand lo ammaini chusa annav...varninchav...very good...intaki tarvatha aa ammai ekkadiki vellindi mari??

    Anyway chala baga rasav...keep writing

    ReplyDelete
  10. గుంటూరులో అమ్మయిని చూసి కొట్టుకున్నది వర్మగారి మనసు......
    భాస్కర్ రామిరెడ్డిగారు..... ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి.....
    అందులోను బెత్తం పట్టి కొట్టి మరీ ప్రేమ పాఠాలు చెప్పాలటండి!!

    ReplyDelete
  11. బస్టాండులో అమ్మాయిలూ ఎప్పుడూ బాగుంటారు.. ఎందుకంటె.. తళుక్కున మెరిసి ... మాయమౌతారు గనుక..
    ఇంక నది వంపులను దానికి జోడించారు..
    వహ్వా..వహ్వా.. :) నేను శివ ... :)

    ReplyDelete
  12. @ జయచంద్ర గారికి,స్రుజనా గారికి,నేస్తము గారికి, వేణూ శ్రీకాంత్ గారికి, శేఖర్ గారికి ధన్యవాదాలు.
    @ భాస్కర రామిరెడ్డి గారు పద్మ గారు బెత్తము పట్టు కొని మరి రాయించాలా చెప్పండి పద్మ గారి ముందు నేను ఎంత చెప్పండి. .
    @ ఆత్రేయ గారు నా తప్పులకు క్షమించండి ఎప్పుడొ రాసిన తెలుగు కదండి కొంచెం కష్టం గా వుంది.
    @ బాబా గారు చాలా ధన్యవాదాలు.
    @ నరేష్ గారు ఎందుకో తెలియదు గాని గుంటూరు అంటె చాలా ఇష్టం నాకు.
    @ కిషన్ రెడ్డి గారు ఇంకా చాల వుంది చెబుతాను కొంచెం సమయము పడుతుంది .
    @ శివ గారు మీరు అన్నది నిజమే సుమా.
    @ పద్మ గారు మనసు కొట్టు కొవడం కాదు గాని స్పందిచింది. అయిన ప్రేమ పాఠాలు ఎమీ లేవు

    ReplyDelete
  13. అమ్మాయిలను చూడడానికి బస్టాండ్ దాక వెళ్ళాలా
    స్టూడెంట్ ఆయినా అవ్వండి లెక్చరర్ ఆయినా ఓకే !

    బావుంది పోస్ట్ లెంగ్త్ కొంచెం ఎక్కువగా అనిపించింది

    ReplyDelete
  14. ఒక్క నదిని కూడా విడిచిపెట్టలేదు కదా... అంతగా ప్రేమ వరదలో మునిగిపోయారన్న మాట!!

    ReplyDelete
  15. mee mirchi ghatu'ni challabarachadaniki vachina mee nadi sundari chala bagundandi...aina kuda jagrattandoy varadalochinappudu..

    inthaki nenu meeku kotha kadu.. na peru praneeta..muraligari blog lo mee blog address choosanu..

    ReplyDelete
  16. ఇంతకి అమ్మాయిని చూసావా? మర్రిచెంబు ని చూసావా? అహ.. ఏం లేదు అన్నేసి నదులు నీకు గుర్తొచింది అంతే కొంచం డౌట్ వచ్చింది అంతే.. :)

    బాగుంది.. వరైటి గా చక్కగా ఉంది.

    ReplyDelete
  17. హరే క్రష్ణ గారికి, మురళి గారికి, ప్రణీత గారికి, శశాంక్ గారికి మరియ మాట్రిక్స్ రే గారికి చాల ధన్యవాదలూ

    ReplyDelete
  18. వర్మ గారు, మీ బ్లాగ్ చాలా బాగుంది. మీరు సోషల్ లో ఫస్ట్ అనుకుంటా.... అన్ని నదుల పేర్లు ఎలా గుర్తు ఉన్నాయండి????
    అమ్మాయి ని చూస్తే అన్నీ మర్చిపోతారు అంటారు కానీ మీకు ఎప్పుడో చదువుకున్న నదుల పేర్లు అన్నీ గుర్తు వచ్చేసాయే...
    మీ కవితా దోరణి చాలా చాలా బాగుంది.

    మీ బ్లాగ్ ని చూడటం ఇదే మొదటిసారి.
    ఇన్నాళ్ళు మిస్ అయ్యాను.
    sorry for this late reply.

    ReplyDelete
  19. బాగుంది మీ నదుల జోరు.
    ఆ ఒక్క అమ్మాయిలో అన్ని నదులు ఉన్నాయంటే మరి మీకు సముద్రమంత ప్రేముండాలి. దాన్ని చూపగలిగేంత "ఆస్థి" ఉండాలి :)
    ఆలోచించుకోండి ఓ సారి.

    ReplyDelete
  20. మొత్తానికి ఆ అమ్మాయిని చూసిన వెంటనే మీ మది వరద గోదారి అయ్యిందన్న మాట !
    ఇక నదులన్నిటినీ కలుపుకొనే సాగరుడిలా మీ హృదయసాగరంలోకి ఆహ్వానించండి మరి !

    ReplyDelete