Saturday, July 4, 2009

నా నేస్తమూ.........


తరలి వెల్లే మేఘ మాలికలను అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

కుండపొతగా జారిపడుతున్న వర్షపు బిందువులని అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

ఎగిరి ఎగిరి తుల్లి పడుతున్న సముద్రపు అలలను అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

ఉప్పొంగి పొంగే సెలయేటి నీటి ని అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

గుంపులు గుంపులు గా పరుగులు తీస్తున్న పక్షులని అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

తన కమ్మని గానముతొ అలరిస్తున్న కొయిలమ్మని అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

తొలిపొద్దు సుర్య కిరణాలను అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

పున్నమి వెన్నెల కాంతులు వెదజల్లే చందమామను అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

ముంగిట్లొ ముగ్గులు వెసే ముద్దు గుమ్మని అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,

అప్పుడు అవన్నీ నాకు చెప్పినవి నీ నేస్తము ఎక్కడొ కాదు ఇ బ్లాగుల లొకం లొ ఊన్నారు వెళ్లు అని

అందుకనే మీ అందరి కొసము ఈ మన లొకం లొకి వఛ్ఛాను నేస్తములారా నన్ను కూడా మీ స్నెహితుడిగా చేసుకొండి

నేను మీ మిర్చీ వర్మ ను, మాది గుంటూరు........

7 comments:

  1. ఇంత మంది నేస్తాల మధ్యనున్న మీకు కొదవేమిటండి?

    ReplyDelete
  2. భావానికి వ్యక్తమవ్వాలని, మనసుకి విప్పుకోవాలని, హృదయానికి పంచుకోవాలని, భావుకతకి రెక్కలు కట్టుకోవాలని ఆలోచన కలిగించే వేదిక ఇది. ఇష్టాగోష్టులు, అరమరికలు లేని సాహితీమైత్రి ఇక్కడి తీరుతెన్నులు. బ్లాగ్లోకానికి స్వాగతం.

    ReplyDelete
  3. mee sneha hastaaniki naa manahpoorvaka swaagataanjali. usha gaari laamTi mitrulu kalustaaru. manalanu manam tarachi choosukunEmduku todpadataaru. inka mee Gunturu ghaatu choopimchandi.

    ReplyDelete
  4. చాలా ధన్యవాదాలండి మా నేస్తము పద్మ గారికి, ఉష గారికి, వర్మ గారికి

    ReplyDelete
  5. chala baga raasaru ....assalu me mirapa ghaatu lekunda

    ReplyDelete
  6. నా సూచన అందరికీ నచ్చాలని లేదు మీతో సహా...అడిగారు కాబట్టి ఒక చిన్న సూచన ( గుంటూరు పిల్లోడివని )... :)

    కవితలోని భావం బాగుంది.కానీ చదువుకోడానికి గానీ, పాడుకోవటానికి గానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు.

    మీ కవితలో కొన్ని పంక్తులు ఇవి..

    తరలి వెల్లే మేఘ మాలికలను అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,
    కుండపొతగా జారిపడుతున్న వర్షపు బిందువులని అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,
    ఎగిరి ఎగిరి తుల్లి పడుతున్న సముద్రపు అలలను అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,
    ఉప్పొంగి పొంగే సెలయేటి నీటి ని అడిగాను నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ,


    ఇందులో "నా నేస్తము చిరునామా ఎక్కడా అనీ," ఇది అన్ని పాదాలకు కామన్ గా వచ్చింది కదా... దీన్ని విడిగా వుంచి ఇలా చూడండి ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందేమో

    తరలివెల్లే మేఘమాలికనడిగా
    జారిన జడివాన బిందువునడిగా
    త్రుళ్ళి పడే అల నడిగా (నింగికెగసే కెరటాన్నడిగా)
    అవధిలేని అంబుధినడిగా ( నిశ్చల సముద్రునడిగా) ..... నా నేస్తము చిరునామా ఎక్కడని.

    బ్రాకెట్స్ లో వున్నరెండు ఎవరిష్టం వారిది, ఇలాగే మీ కవితను మరొక్కసారి చదివారంటే మీకే కొత్తకొత్త ఆలోచనలు రావచ్చు

    ReplyDelete
  7. గుంటూరు మిర్చి వర్మగారూ మా స్నేహ బృందం లోనికి మనః పూర్వక స్వాగతం.

    కవిత బాగుంది. మీరు ఎవరో ఒక్క నేస్తం చిరునామా అడిగితే చూసారా మొత్తం ఎంతమంది నేస్తాలనిచ్చారో ఆ ప్రకృతి దేవతలు... :)

    భాస్కర రమిరెడ్డి గరికి: ఇప్పుడిప్పుడే బ్లాగు మొదలు పెట్టడు కదండీ మన గుంటూరు పిల్లవాడు. కాస్త ఆగండీ... ఆఘాటు చూపిస్తాడు.. :)

    ReplyDelete